News23rd Oct 01:28 PMSunil Byrisetty1 min read
వర్షపు నీరు ప్రవాహం డ్రోన్ తో పరిశీలన
ఔట్ ఫాల్ డ్రైన్ లో వర్షపు నీరు ప్రవాహం డ్రోన్ తో పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిలి రోడ్డు, మదర్ తెరిసా జంక్షన్, పిన్న
ఔట్ ఫాల్ డ్రైన్ లో వర్షపు నీరు ప్రవాహం డ్రోన్ తో పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిలి రోడ్డు, మదర్ తెరిసా జంక్షన్, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, లయోలా కాలేజ్ రోడ్డు, ఈఎస్ఐ హాస్పిటల్ జంక్షన్, ఇన్నర్ రింగ్ రోడ్, 33 తూముల సెంటర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో వర్షపు నీరు ప్రవాహాన్ని పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ డీసిల్టింగ్ పనులు ఎప్పటికప్పుడు జరుగుతుండాలని, కల్వర్ట్ ల వద్ద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యర్థాలను తొలగించాలని, కల్వర్ట్లను పూర్తిస్థాయిలో మెయింటెనెన్స్ చేయాలని, 33 తుమ్ముల వద్ద గుర్రపు డెక్కలను తొలగించాలని, ఈఎస్ఐ జంక్షన్ వద్ద కిందకున్న కల్వర్టును లెవెల్ పెంచమని, ఔట్ ఫాల్ డ్రైన్ ను డ్రోన్ తో పరిశీలించి, ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేసుకుంటూ, వర్షపునీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ధర్నా చౌక్ వద్దగల అన్న కాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతిరోజు నిర్దేశిత సమయానికి అన్నా క్యాంటీన్ ను తెరుస్తున్నారా, ఆహారంలో నాణ్యత ఉంటుందా, పారిశుధ్య నిర్వహణ ఎలా ఉంటుంది, త్రాగునీరు అందుబాటులో ఉంటుందా వంటి అంశాలను అక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు.