News21st Sep 05:42 PMSunil Byrisetty1 min read
ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. ప
ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు. ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, సమస్యకు తగిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం కార్యాలయ స్థాయిలో పరిశీలించకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. నగరంలో ప్రతిరోజూ ఎక్కడెక్కడ డీసిల్టింగ్ ప్రక్రియ జరుగుతుందో వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి, సమర్పించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో చెత్త కుప్పలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, పారిశుద్ధ్య కార్మికుల ద్వారా తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా, సమస్య స్వభావాన్ని బట్టి అత్యంత త్వరగా పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు.