News27th Jul 04:42 PMSunil Byrisetty1 min read

శక్తి యాప్ పై విస్తృత అవగాహన

మహిళలు, బాలికల రక్షణ కోసం కల్పించబడుతున్న మహిళా చట్టాల గురించి మహిళలకు, విధ్యార్ధులకు పోలీసులు విస్తృత అవగాహన కల్పించారు. శక్తి యాప్, 112 (అత్యవసర సేవలు), 1930 (సైబర్ మోసాల నివేదిక

శక్తి యాప్ పై విస్తృత అవగాహన
మహిళలు, బాలికల రక్షణ కోసం కల్పించబడుతున్న మహిళా చట్టాల గురించి మహిళలకు, విధ్యార్ధులకు పోలీసులు విస్తృత అవగాహన కల్పించారు. శక్తి యాప్, 112 (అత్యవసర సేవలు), 1930 (సైబర్ మోసాల నివేదికల కోసం), 1098 (బాలల హెల్ప్‌లైన్), 181 (మహిళల హెల్ప్‌లైన్), 1073 (ట్రాఫిక్ సమాచారం కోసం), 101 (ఫైర్ ఎమర్జెన్సీ) వంటి కీలకమైన టోల్-ఫ్రీ నెంబర్ లపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా ఆపద సమయాలలో ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పించారు. విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత, మహిళా పోలీసు స్టేషన్ ఎ.సి.పి. టి.దైవ ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్.టి.ఆర్. పోలీసు కమిషనరేట్ పరిదిలోని శక్తి టీం బృంధాలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు, బాలికలకు మహిళా చట్టాల గురించి, శక్తి యాప్ వలన కలిగే ఉపయోగాలు గురించి వివరించారు. అలాగే వారి ఫోన్ లలో శక్తి యాప్ లను డౌన్ లోడ్ చేయించడం, సోషల్ మీడియా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి, చిన్నపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాల గురించి అవగాహన కల్పించారు.
Andhra Pradesh news
Vijayawada Police
Women Safety
Child Protection
Shakti App
Cyber Crime Awareness
Emergency Helplines
SV Rajasekhar Babu
KGVS Saritha
Daiva Prasad
Public Awareness Campaign
Scroll for the next article