News11th Jul 04:47 PMSunil Byrisetty1 min read
విజయవాడ రైల్వే స్టేషన్‌లో గంజా చాక్లెట్లు!
విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీస్ అధికారులు, సత్యనారాయణపురం పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ ప్లాట్ ఫారం మీద ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో వివిధ ప్రాంతాల నుంచి వ
విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీస్ అధికారులు, సత్యనారాయణపురం పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ ప్లాట్ ఫారం మీద ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రైలులో గంజా చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గంజా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రైల్వే స్టేషన్ పరిధి ప్రాంతమైన సత్యనారాయణపురం స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు ఈ ఆకస్మిక తనిఖీల్లో పాల్గొన్నారు.