News9th Jul 03:43 PMSunil Byrisetty1 min read
కదం తొక్కిన కార్మిక వర్గం
రాజధాని విజయవాడలో కార్మికుల సమ్మె విజయవంతమైంది. తమ విధులను బహిష్కరించి సమ్మెలో వేలాదిగా కార్మిక వర్గం పాల్గొన్నారు. రైల్వే, బ్యాంకు, ఎల్ఐసి, వివిధ సంఘటిత, అసంఘటితరంగాల కార్మికులు వ
రాజధాని విజయవాడలో కార్మికుల సమ్మె విజయవంతమైంది. తమ విధులను బహిష్కరించి సమ్మెలో వేలాదిగా కార్మిక వర్గం పాల్గొన్నారు. రైల్వే, బ్యాంకు, ఎల్ఐసి, వివిధ సంఘటిత, అసంఘటితరంగాల కార్మికులు వేలాదిగా సమ్మెలో పాల్గొన్నారు. విజయవాడ వన్ టౌన్ రధం సెంటర్ నుంచి లోబ్రిడ్జి మీదుగా, ఏలూరు రోడ్డు మీదుగా, లెనిన్ సెంటర్ కు ప్రదర్శనగా చేరుకున్నారు. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, నూతన వ్యవసాయం మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్మిక, కర్షక ఐక్యత వర్ధిల్లాలంటూ పెద్దపెట్టున నినదించారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం లెనిన్ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం మాట్లాడారు. ఈ సమ్మె కేవలం కొసమెరుపు మాత్రమేనన్నారు. ప్రభుత్వాలు ఉన్నది ప్రజల పాలన కోసమా? కంపెనీల శ్రేయస్సు కోసమా! అని ప్రశ్నించారు.