News13th Mar 12:58 PMSunil Byrisetty1 min read

జగన్ రద్దు చేస్తే.. చంద్రబాబు పున:ప్రారంభిస్తారు

కృష్ణా నదిపై మరో బ్యారేజీని నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. రాజధాని ప్రాంతాన్ని, ఎన్టీఆర్ జిల్లాను అనుసంధినిస్తూ ప్రకాశం బ్యారేజీ ఉంది. అదే విధంగా సమాంతరంగా నదిపై వ

జగన్ రద్దు చేస్తే.. చంద్రబాబు పున:ప్రారంభిస్తారు
కృష్ణా నదిపై మరో బ్యారేజీని నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. రాజధాని ప్రాంతాన్ని, ఎన్టీఆర్ జిల్లాను అనుసంధినిస్తూ ప్రకాశం బ్యారేజీ ఉంది. అదే విధంగా సమాంతరంగా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. 2019 ఫిబ్రవరిలోనే పనులనూ ప్రారంభించింది. అయితే తర్వాత వచ్చిన వైయస్సార్సీపీ ప్రభుత్వం బ్యారేజీని రద్దు చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు మధ్య రవాణాకే కాకుండా నీటి నిల్వకూ ఉపయోగపడే బ్యారేజీని నిర్మించేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగునీటి అవసరాలకు బ్యారేజ్ సరిపోతుంది. 10 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో మళ్లీ వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణానికి డీపీఆర్ తయారుచేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కృష్ణా నదికి వరద వచ్చినా 15 లక్షల క్యూసెక్కుల తాకిడి తట్టుకునేలా డీపీఆర్ తయారుచేస్తున్నామని వివరించారు. నాడు జగన్ రద్దు చేస్తే.. నేడు చంద్రబాబు పున:ప్రారంభిస్తున్నారని తెలిపారు.
Andhra Pradesh
AP News
Vijayawada central
Vijayawada
barrage
ఆంధ్రప్రదేశ్
వార్తలు
విజయవాడ సెంట్రల్
విజయవాడ
బ్యారేజ్
Scroll for the next article