News25th Nov 03:29 PMSunil Byrisetty1 min read
అమరావతికి ధీటుగా విజయవాడ అభివృద్ధి
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి వేగానికి సరితూగేలా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం దృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నదని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె ర
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి వేగానికి సరితూగేలా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం దృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నదని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నగర మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూ.93.08 లక్షల వ్యయంతో తూర్పు నియోజకవర్గంలో మెట్రోపాలిటన్ హోటల్ వద్ద వెయ్యి మీటర్ల డ్రెయిన్ నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. డ్రెయిన్ నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు.
ఎంపీ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని పూర్తిస్థాయిలో మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని, స్ట్రామ్‌వాటర్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థలను సమూలంగా మెరుగుపరచాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ లక్ష్యంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ. 2,000 కోట్ల డిపీఆర్ సిద్ధమవుతోందని వివరించారు. ఈ ప్రణాళిక అమలు అయితే నగరంలో వర్షం పడినప్పుడు చుక్క నీరు కూడా రోడ్డు మీద నిల్వ ఉండకుండా నగరానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని, కొండప్రాంతాల్లో కూడా మంచి నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు.