News7th Dec 05:09 PMSunil Byrisetty1 min read
మీ భద్రత మీ చేతుల్లో
విజయవాడ నగరంలో వాహనదారులకు సేఫ్ రైడింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపధ్యంలో నగరంలో బెంజ్ సర్కిల్ పరిసర ప్రాంతాలలో వాహనదారుల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు అధికారులు ప్ర
విజయవాడ నగరంలో వాహనదారులకు సేఫ్ రైడింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపధ్యంలో నగరంలో బెంజ్ సర్కిల్ పరిసర ప్రాంతాలలో వాహనదారుల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ ప్రయాణిస్తున్న వాహనదారులను ప్రత్యేకంగా గుర్తించి వారిని అభినందించారు.
ఈ క్రమంలో హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు, ద్విచక్ర వాహనదారులు ప్రయాణించు సమయంలో వెనుక వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించడం, సీటు బెల్ట్ ధరించి క్రమబద్ధంగా డ్రైవ్ చేస్తున్న కారు డ్రైవర్లకు “Thank You for Safe Riding – Traffic Police, Vijayawada City (NTR District)” అనే ట్యాగ్‌తో కూడిన బెలూన్లు అందజేశారు. ఈ చర్య ప్రజల్లో సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంచడమే కాకుండా, ఇతరులకు కూడా మంచి ప్రేరణగా మారింది.