News20th Sep 11:00 AMSunil Byrisetty1 min read
విజయవాడ ఉత్సవ్‌కు పవన్‌కు ఆహ్వానం
'విజయవాడ ఉత్స వ్' ఈనెల 22వ తేదీన ప్రారంభం కానుంది. ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రా
'విజయవాడ ఉత్స వ్' ఈనెల 22వ తేదీన ప్రారంభం కానుంది. ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఉత్సవ కమిటీ సభ్యులు ముత్తవరపు మురళీకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. విజయవాడ నగర ఖ్యాతి ప్రపంచ నలుమూలల తెలియచేయాలని వారు
ఆకాంక్షించారు. ఒక మంచి సంకల్పంతో తలపెట్టిన విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ పండుగ కార్యక్రమంలో మనమందరం భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.