News26th May 01:30 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిలో.. ఆ సమయాల్లో వీఐపీ దర్శనాల రద్దు
రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & డిప్యూటీ కలెక్టర్ వి. కె. శీనానాయక్ తెలిపారు. ’గత రెండు వారాలు
రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & డిప్యూటీ కలెక్టర్ వి. కె. శీనానాయక్ తెలిపారు. ’గత రెండు వారాలుగా అనేక అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశిలిస్తున్నాం. వేలాదిగా అమ్మ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ వుంటారు. భక్తుల సౌకర్యార్థం వీఐపీ దర్శనాలని 11:30 నుంచి 1:30 వరకు రద్దు చేయడం జరిగింది. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 3,4,5 తేదీలలో నవ గ్రహముల పునః ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమమాలలో మహా మండపం,పూజ మండపం తదితర వాటిని అభివృద్ధి చేస్తున్నాం. యుద్ద ప్రాతిపదికన వచ్చిన భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దుర్గా ఘాట్ ను కూడి వైపుకు విస్తరించే విధంగా అధికారులను కోరడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా అన్ని ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామ‘ని ఈవో శీనానాయక్ తెలిపారు.