News15th Jul 05:47 PMSunil Byrisetty1 min read
ప్రమాదాల నివారణే లక్ష్యంగా రేడియం స్టిక్కర్లతో ప్లాస్టిక్ డ్రమ్ములు
రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా కృష్ణాజిల్లా పోలీసులు రేడియం స్టిక్కర్లతో కూడిన ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదేశాల మేరకు, అవనిగడ్డ డిఎస్పి ట
రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా కృష్ణాజిల్లా పోలీసులు రేడియం స్టిక్కర్లతో కూడిన ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదేశాల మేరకు, అవనిగడ్డ డిఎస్పి టీ.విద్య శ్రీ సూచనల మేరకు, జిల్లా వ్యాప్తంగా రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకపల్లి మరియు జిలగలగండి మార్గమధ్యంలో వాహనదారుల వేగాన్ని నియంత్రించేందుకు జిగ్జాగ్ పేట్రర్న్‌లో రేడియం స్టిక్కర్స్ అతికించిన ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేయడం జరిగింది. మితిమీరిన వేగం వలన ప్రమాదాలు జరుగుతుండడంతో వాహన వేగాన్ని నియంత్రించాలని నిర్ణయించారు.. రాత్రి సమయాలలో కూడా స్పష్టంగా కనిపించే విధంగా రేడియం స్టిక్కర్స్ను డ్రమ్ములకు ఏర్పాటు చేయడం జరిగింది.