News16th Aug 03:17 PMSunil Byrisetty1 min read

ప్రమాదపుటంచుల్లో ఆటవిడుపు?!

తాడేపల్లిలో పిల్లల ఆటలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రకాశం బ్యారేజి దిగువున కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సెలవు రోజులు కావడంతో చిన్నా.. పెద్దా అనే తేడ

ప్రమాదపుటంచుల్లో ఆటవిడుపు?!
తాడేపల్లిలో పిల్లల ఆటలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రకాశం బ్యారేజి దిగువున కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సెలవు రోజులు కావడంతో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా వందల మంది సీతానగరం ఘాట్ల వద్దకు వస్తున్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న నది అంచులు వద్దకు వెళ్లి...ఫోటోలు,వీడియోలు దిగడం...ఆటలాడడం వంటివి చేస్తున్నారు. అలాంటి సమయాల్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే....బాద్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరద వల్ల స్థానిక మత్స్యకారులే.. నది వైపు వెళ్లే సాహసం చేయడం లేదు.నది ఇంత ప్రమాదకర స్థాయి లో ప్రవహిస్తున్నా రక్షణ చర్యలు లేవు. దీంతో ఆటవిడుపు కోసం పిల్లలు, పెద్దలు అక్కడకు చేరుతున్నారు. పోలీసులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
Andhra Pradesh
Tadepalli
Krishna River
Floods
Children Safety
Prakasam Barrage
Sitanagaram Ghats
Water Safety
Police Action
Public Safety
ఉధృతంగా పారుతున్న కృష్ణమ్మ
పిల్లల భద్రత
Scroll for the next article