News13th Jan 11:14 AMSunil Byrisetty1 min read
గ్రామంలో అగ్ని ప్రమాదం.. ఊరంతా దగ్ధం
పండుగ సమయంలో కాకినాడ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంలో చిక్కుకొని నిమిషాల్లో భస్మమైంది. మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని 3 పక్కా ఇళ్ల
పండుగ సమయంలో కాకినాడ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంలో చిక్కుకొని నిమిషాల్లో భస్మమైంది. మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని 3 పక్కా ఇళ్లు మినహా, 38 పూరిళ్లు కాలిపోయాయి. 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. గ్రామస్థులు సంక్రాంతి సందర్భంగా సరకుల కొనుగోళ్లకు సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి ఊరంతా శ్మశానంగా మారింది. సమాచారం తెలియగానే సీఎం చంద్రబాబు యుద్ధప్రాతిపదికన సమీక్ష జరిపి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.