News17th Jan 03:40 PMSunil Byrisetty1 min read
ఆర్యవైశ్యుల కోరిక మేరకు వాసవీ పెనుగొండ పేరు
ఈ నెల 20వ తేదిన జరిగే అధికారిక కార్యక్రమమైన కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం విజయవంతం చేయాల్సిందిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి
ఈ నెల 20వ తేదిన జరిగే అధికారిక కార్యక్రమమైన కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం విజయవంతం చేయాల్సిందిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాట్లాడుతూ.. సంక్రాంతి సంబరాలు జరుపుకున్నట్లుగానే ఈ నెల 20న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకోవాలన్నారు. మాఘశుద్ధ విదియ రోజున జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా చేయడం ఆనందదాయకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టారని, మేనిఫెస్టో ప్రకారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమం చేశారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాదిలోనే.. తిరుమల వెంకటేశ్వర స్వామికి, కనకదుర్గమ్మ అమ్మవారికి, శ్రీశైల మల్లన్న స్వామికి పట్టువస్త్రాలు సమర్పించినట్లుగానే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తూ. గో జిల్లా పెనుగొండలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారికి కూడా పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఆనవాయితీగా వస్తోందన్నారు. పెనుగొండ గ్రామాన్ని వాసవీ పెనుగొండగా మారుస్తూ జీవో ఎం ఎస్ నెం. 521 తేగలిగామంటే కూటమి ప్రభుత్వ నిర్దిష్ట పాలనకు నిదర్శనమని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఆర్యవైశ్యుల కోరిక మేరకు వాసవీ పెనుగొండ గ్రామంగా పేరు పెట్టారని రాకేష్ వివరించారు.