News7th Oct 10:11 AMSunil Byrisetty1 min read
అసలే గుంతలు.. ఆపై వాహనాల వాయువేగం
అసలే గుంతల రోడ్డు.. ఆపై వాయువేగంతో వస్తున్న ఆ యూనివర్శిటీ, పలు స్కూల్, కాలేజీ బస్సులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అంటూ గ్రామస్థులు వాపోతున్నారు. కేఎల్ యూనివర్సిటీతో పాటు వరుసగా పల
అసలే గుంతల రోడ్డు.. ఆపై వాయువేగంతో వస్తున్న ఆ యూనివర్శిటీ, పలు స్కూల్, కాలేజీ బస్సులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అంటూ గ్రామస్థులు వాపోతున్నారు. కేఎల్ యూనివర్సిటీతో పాటు వరుసగా పలు స్కూల్, కాలేజీ బస్సులతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నిత్యం తాడేపల్లి ప్రాతురు గ్రామం గుండా అతి వేగంతో కేఎల్ యూనివర్సిటీ బస్సులు నడుస్తున్నాయి. వాహనాల ధాటికి రోడ్లపై ప్రయాణం చేయాలంటే వణికిపోతున్నారు. తమ గ్రామంలో రోడ్లు వేసి, తమ కష్టాలు తీర్చాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన నారా లోకేష్ స్పందించాలని కోరుతున్నారు.