Politics29th Sep 03:52 PMSunil Byrisetty1 min read
కూటమి ప్రభుత్వంలో మారుతున్న గ్రామాల రూపురేఖలు
రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గాంధీజీ కలలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గ్రామస్వరాజ్యమే దేశ ప్రగతికి పట్టుగొమ్
రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గాంధీజీ కలలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గ్రామస్వరాజ్యమే దేశ ప్రగతికి పట్టుగొమ్మ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక అనేక ఏళ్లపాటు పల్లెలపై దృష్టి పెట్టలేదని, పల్లెల్లో జీవించలేక అనేకమంది వలసలు పోయారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో అనేక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రతి పౌరుడూ గర్వంగా జీవించేలా సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, పచ్చదనం సౌకర్యాలు వచ్చాయని తెలిపారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రైతులు పండించే ప్రతి పంటకూ గిట్టుబాటు ధర ఇస్తున్నామని మాధవ్ అన్నారు.