TTD12th Nov 05:12 PMSunil Byrisetty1 min read
టీటీడీ సాధికారిక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సాధికారిక మండలి సభ్యులుగా నియమితులైన వినయ్ చంద్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమలలో నిర్వహించిన కార్యక్రమంలో టీటీడీ జేఈవో సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకార
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సాధికారిక మండలి సభ్యులుగా నియమితులైన వినయ్ చంద్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమలలో నిర్వహించిన కార్యక్రమంలో టీటీడీ జేఈవో సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తిరుమల జేఈవో శ్రీ వెంకయ్య చౌదరి, వినయ్ చంద్‌కు తీర్థప్రసాదాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులతో నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ టీటీడీ అభివృద్ధికి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. టీటీడీ సాధికారిక మండలి సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన వినయ్ చంద్‌కు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకం ఆయనపై మరింత బాధ్యతను పెంచిందని, భగవంతుని సేవలో అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.