Spiritual2nd Oct 10:13 AMSunil Byrisetty1 min read
నేడు VIP దర్శనాలు రద్దు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో శీనా నాయ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో శీనా నాయక్ ప్రకటించారు. అన్ని క్యూలైన్లు ఉచితమేనని, ప్రతి భక్తునికి ఉచితంగా 20 గ్రాముల లడ్డూ ప్రసాదం అందజేస్తామని తెలిపారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ దుర్గగుడికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో అందరికీ దర్శనభాగ్యం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. నవరాత్రుల్లో ఆఖరి రోజైన నేడు అమ్మవారు రాజరాజేశ్వరిగా దర్శనమిస్తున్నారు.