News30th Aug 09:43 AMSunil Byrisetty1 min read
ఏసీబీ కోర్టు సంచలన తీర్పు
విశాఖ ఏసీబీ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జ
విశాఖ ఏసీబీ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2.5 లక్షల జరిమానాను కూడా విధించింది. విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త మంగరాజు, అతని తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల పై వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్‌లో పెద్దయ్య 2015లో ఎస్సైగా పని చేస్తున్న సమయంలో సదరు మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో మంగరాజు, అతని కుటుంబ సభ్యులపై వరకట్నం నిషేధం చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మంగరాజు నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. ఈ కేసులో ఏసీబీ కోర్ట్ తాజాగా తీర్పు వెలువరించింది.