News29th Jul 12:26 PMSunil Byrisetty1 min read

విశాఖకు ఆ రోజే ఆఖరు.. తర్వాత భోగాపురం నుంచే!

విశాఖ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆగస్టు

విశాఖకు ఆ రోజే ఆఖరు.. తర్వాత భోగాపురం నుంచే!
విశాఖ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను నిలిపేస్తున్నట్లు పౌరవిమానయానశాఖ ప్రకటించింది. 30 ఏళ్లపాటు సేవలందించిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 17 నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. అలాగే విశాఖకు ఉన్న ట్రావెల్ కోడ్ ‘వీటీజడ్’ కూడా ఇకపై భోగాపురానికి వర్తించనుంది.
Andhra Pradesh
Bhogapuram International Airport
Alluri Sitarama Raju International Airport
Visakhapatnam Airport
Bhogapuram
నరేంద్ర మోదీ
పౌరవిమానయాన శాఖ
విమాన సర్వీసులు
వాణిజ్య విమానాలు
వీటీజడ్
Scroll for the next article