News29th Aug 03:18 PMSunil Byrisetty1 min read

విశాఖ, భువనేశ్వర్.. మహిళలకు భద్రత గల నగరాలు!

ఏపీ ఆర్థిక, ఐటీ రాజధాని విశాఖపట్నం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో విశాఖ చోటు దక్కించుకుంది. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక గురువారం రి

విశాఖ, భువనేశ్వర్.. మహిళలకు భద్రత గల నగరాలు!
ఏపీ ఆర్థిక, ఐటీ రాజధాని విశాఖపట్నం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో విశాఖ చోటు దక్కించుకుంది. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక గురువారం రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా దాదాపు 31 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. దాదాపు13,770 మంది మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ నివేదికలో జాతీయ భద్రతా స్కోరును 65 శాతంగా పేర్కొంది. దీనికి ఎగువన ఉన్న నగరాలను సురక్షితమైనవిగా, దిగువన ఉన్న వాటిని భద్రత లేనివిగా వర్గీకరించింది. సురక్షితమైన నగరాల జాబితాలో విశాఖ, భువనేశ్వర్, కోహిమా, ఐజ్వాల్‌, ఈటా నగర్‌, ముంబై, గాంగ్‌ టాక్‌లు నిలవగా..పట్నా, జైపుర్, ఫరిదాబాద్, దిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీలు భద్రత లేని ప్రాంతాలుగా ఉన్నాయి. నివేదికను విడుదల చేస్తున్నప్పుడు జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయా రహత్కర్‌ మాట్లాడుతూ.. మహిళల క్షేమాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడలేమని, అది స్త్రీ జీవితంలోని విద్య, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు, స్వేచ్ఛ వంటి ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతి, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది.
Andhra Pradesh
Visakhapatnam
Women Safety
NCW Report
Urban Safety
Women Empowerment
Bhuvaneswar
విజయా రహత్కర్
మహిళా సాధికారత
Scroll for the next article