News12th Nov 04:42 PMSunil Byrisetty1 min read

సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ

31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో 12,13 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఏపీ సంస్కృతి

సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో 12,13 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఏపీ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గిరిజన థింసా డాన్స్, గరగ నృత్యం, తప్పెట గుళ్ళు తదితర సంప్రదాయాలను తెలియచేసేలా ఏర్పాటు చేశారు. ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలాట కూచిపూడి లాంటి సాంప్రదాయ కళల్ని ప్రదర్శించేలా అలంకరించారు. ప్రధాన ప్లీనరీ హాల్ తో పాటు పారిశ్రామిక వేత్తలు చర్చలు జరిపేలా వివిధ సమావేశ ప్రాంగణాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. దిగ్గజ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యి చర్చలు జరిపేందుకు వీలుగా మరో ప్రత్యేక హాల్ సిద్ధమైంది.
Scroll for the next article