News12th Dec 03:38 PMSunil Byrisetty1 min read

దేశంలో మహిళలకు సేఫెస్ట్ సిటీ విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ లో లీడర్ షిప్ కి ఎలాంటి కొరత లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని నగరాల కన్నా విశాఖపట్నంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ 20 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

దేశంలో మహిళలకు సేఫెస్ట్ సిటీ విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ లో లీడర్ షిప్ కి ఎలాంటి కొరత లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని నగరాల కన్నా విశాఖపట్నంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ 20 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం కాగ్నిజెంట్ సంస్థ గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మనీలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసి మాట్లాడారు. అన్ని నగరాల్లో ప్రాపర్ గా ప్లాన్ చేయకపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పెరిగిపోయాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేయడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును 165 కిలోమీటర్ల మేర వేయడంతోపాటు రహదారులను వెడల్పు చేయడం వల్ల మోస్ట్ లివింగ్ సిటీగా మారిందని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖపట్నం ఈ మీటింగ్ తో ఎకనమిక్ రీజియన్ గా హైదరాబాద్ ను మించి ప్రపంచంలోనే బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ తో నెట్ జీరో కాన్సెప్ట్ తో విశాఖపట్నాన్ని సుందరమైన నగరంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విశాఖపట్నం మహిళలకు సేఫెస్ట్ సిటీ అని, కేంద్ర ప్రభుత్వం కూడా ఉమెన్ కి సేఫెస్ట్ సిటీగా ప్రకటించిందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ కూడా నాలుగైదు నగరాలను ఎంపిక చేసి, ఓవరాల్ డెవలప్ చేయాలనుకుంటోందని, అందులో విశాఖపట్నం ఒకటని వివరించారు. 2032 నాటికి 125 నుంచి 135 బిలియన్ యూఎస్ డాలర్ల ఆదాయం వచ్చేలా విశాఖ ఎకనమిక్ రీజియన్ ని డెవలప్ చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
Andhra Pradesh
Visakhapatnam
Women Safety
Safest City
Chandrababu Naidu
Cognizant Groundbreaking
Economic Region
NITI Aayog
Net Zero City
Cost of Living
Development News
Vizag Development
Scroll for the next article