News13th Dec 03:09 PMSunil Byrisetty1 min read
విశాఖ ఎకనామిక్ రీజియన్‌తో ఉత్తరాంధ్రకు స్వర్ణ భవిష్యత్
విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేకమైన అభిమానం మాత్రమే కాదు… రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కేంద్రబిందువుగా భావించే దూరదృష్టి ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ప
విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేకమైన అభిమానం మాత్రమే కాదు… రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కేంద్రబిందువుగా భావించే దూరదృష్టి ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు తొమ్మిది జిల్లాలను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన విశాఖ ఎకనామిక్ రీజియన్ ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి చరిత్రాత్మక మలుపని పేర్కొన్నారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహణతో విశాఖకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని చెప్పారు. సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన విశాఖ ఎకనామిక్ రీజియన్, నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఈ రీజియన్ పరిధిలో ఏడూ గ్రోత్ సెక్టర్లు, 49 కీలక ప్రాజెక్టులు అమలులోకి రానున్నాయని, 2031 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని క్షుణ్ణంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.