News11th Oct 11:17 AMSunil Byrisetty1 min read

గ్లోబల్ డేటా క్యాపిటల్ విశాఖ!

దేశవ్యాప్తంగా విశాఖ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం డేటా రంగంలో లక్షలకోట్ల పెట్టుబడులు ఈ నగరానికి వస్తున్నాయి. టీసీఎస్ కూడా రూ. లక్ష కోట్లతో డేటా కేంద్రం పెట్టేందుకు సిద్ధమయింది

గ్లోబల్ డేటా క్యాపిటల్ విశాఖ!
దేశవ్యాప్తంగా విశాఖ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం డేటా రంగంలో లక్షలకోట్ల పెట్టుబడులు ఈ నగరానికి వస్తున్నాయి. టీసీఎస్ కూడా రూ. లక్ష కోట్లతో డేటా కేంద్రం పెట్టేందుకు సిద్ధమయింది. ఇక ఫేస్ బుక్ కంపెనీ మెటా కంపెనీ తన ‘వాటర్‌వర్త్’ అండర్‌ సీ కేబుల్ ప్రాజెక్ట్ కింద ముంబై, విశాఖపట్నాలను కేబుల్స్ ల్యాండింగ్ సైట్లుగా ఎంచుకుంది. US-ఇండియా మధ్య కనెక్టివిటీని పెంచాలని ప్రణాళిక వేస్తోంది. ఈ 10 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ 50,000 కి.మీ. పొడవైన అండర్‌సీ కేబుల్‌ను దాదాపు 7,000 మీ. లోతులో వేస్తుంది, ఇది గ్లోబల్ డేటా ట్రాన్స్‌మిషన్‌కు 99 శాతం ఆధారం. అదే సమయంలో, గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆసియాలోనే అతిపెద్ద 1 GW డేటా సెంటర్ క్లస్టర్‌ను విశాఖలో నిర్మిస్తోంది.
Andhra Pradesh
Visakhapatnam
Global Data Capital
Data Center Hub
TCS
Meta
Facebook
Water worth Cable
Under sea Cable
Google
Investment
Digital Infrastructure
Scroll for the next article