News13th Dec 02:59 PMSunil Byrisetty1 min read

మరో అంతర్జాతీయ వేడుకకు విశాఖ సిద్ధం

విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి వేడులకు ఆతిథ్యమిస్తోంది. విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026) జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి విశాఖను

మరో అంతర్జాతీయ వేడుకకు విశాఖ సిద్ధం
విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి వేడులకు ఆతిథ్యమిస్తోంది. విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026) జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి విశాఖను సిద్ధం చేస్తున్నారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకలో 23 విదేశీ నౌకలు, 2 విమాన వాహక నౌకలు, 61 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ నౌకల ప్రదర్శనలు, మిలాన్-2026 విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ వేడుకలలో పాల్గొంటారు.
Andhra Pradesh
Visakhapatnam
International Fleet Review International Fleet Review 2026
IFR
Indian Navy
Global Event
Naval Exercises
Milano
అంతర్జాతీయ ప్రతినిధులు
సముద్ర శక్తి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Scroll for the next article