News23rd Apr 11:26 AMSunil Byrisetty1 min read

వెంటాడి మరీ కాల్చేశారు.. ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి!

జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి ఉన్నట్లు గుర్తించారు. అత్యంత అమానవీయంగా వెంటాడి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘోర కలిలో విశాఖ వాసి, విశ్రాంత బ్యాం

వెంటాడి మరీ కాల్చేశారు.. ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి!
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి ఉన్నట్లు గుర్తించారు. అత్యంత అమానవీయంగా వెంటాడి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘోర కలిలో విశాఖ వాసి, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందారు. పారిపోతున్న ఆయన్ను వెంటాడి మరీ చంపినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు ఏమాత్రం కనికరించకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించడంతో విశాఖలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సమాచారం తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి కుటుంబసభ్యులు పహల్గాంకు బయల్దేరి వెళ్లారు.
Visakhapatnam
Chandramouli
Kashmir Pahalgam Terror Attack
ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి
జమ్మూకశ్మీర్లోని పహల్గాం
బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతి
Scroll for the next article