News15th Oct 03:04 PMSunil Byrisetty1 min read

గూగుల్ తో గేమ్ చేంజర్ కాబోతున్న విశాఖ..

గూగుల్ సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం విశ్వనగరంగా ఎదిగేందుకు మరో అడుగు ముందుకు పడిందని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖమంత

గూగుల్ తో  గేమ్ చేంజర్ కాబోతున్న విశాఖ..
గూగుల్ సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం విశ్వనగరంగా ఎదిగేందుకు మరో అడుగు ముందుకు పడిందని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ ల కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యానికి ఈ కొత్త సాంకేతికత ఉపయోగపడుతుందన్న ఆశా భావాన్ని సుభాష్ వ్యక్తం చేశారు. గూగుల్ సంస్ధ విశాఖలో హైపర్ స్కిల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం గేమ్ చేంజర్ గా మారబోతోందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అంటే ఐటీ.. ఐటీ అనేలా విశాఖనగరం రూపుదిద్దుకోబోతోందని ఆయన తెలియజేశారు. ఏఐ టెక్నాలజీని సైతం విశాఖకు నిలయంగా మలిచే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బలమైన పునాదులు వేస్తున్నారని మంత్రి సుభాష్ కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల పాలనలో ఏకంగా దాదాపు 11లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఒక్కగూగుల్ సంస్ధే లక్ష 33 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతోందంటే అది బాబు గ్యారెంటీకి దిక్సూచిగా నిలుస్తుందని వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
Andhra Development
Visakhapatnam
Google India
Data Center
Chandrababu Naidu
Nara Lokesh
Vasan Setti Subhash
AI Technology
Investment
Game Changer
Viksit Bharat
Tech Hub
Google FDI
Scroll for the next article