Sports23rd Aug 11:13 AMSunil Byrisetty1 min read

విశాఖ వేదికగా బ్రిక్స్ కొత్త క్రీడా బంధం

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటి గా కలుపుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం

విశాఖ వేదికగా బ్రిక్స్ కొత్త క్రీడా బంధం
భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటి గా కలుపుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని. అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్‌ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా ‘బ్రిక్స్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. బ్రిక్స్‌ యువజన, క్రీడా మంత్రుల సమావేశాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, అధికారిక విందు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బ్రిక్స్‌ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్‌లకు విశాఖలో సీఎం సాదర స్వాగతం పలికారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్‌ డెస్టినీ గా పేరుందని..భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని సీఎం అభివర్ణించారు.
AP news
sports
Visakhapatnam
BRICS
Chandrababu Naidu
BRICS Youth Meeting
BRICS Sports Ministers
Sports Cooperation
బ్రిక్స్ యూత్
విశాఖ
సిటీ ఆఫ్ డెస్టినీ
ఆంధ్రప్రదేశ్
క్రీడలు
అంతర్జాతీయ సంబంధాలు
Scroll for the next article