News23rd Jul 06:27 PMSunil Byrisetty1 min read
మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు పెట్టుబడులు!
రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో విశాఖ మహానగర రూపురేఖలు మారబోతున్నాయి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 9వ ఎస్ఐపిబ
రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో విశాఖ మహానగర రూపురేఖలు మారబోతున్నాయి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 9వ ఎస్ఐపిబి (స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఐటి రంగంలో 20,216కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటి హబ్ గా రూపుదిద్దుకోనుంది. ఇటీవల మంత్రి లోకేష్ బెంగుళూరు పర్యటన సందర్భంగా 35వేల ఉద్యోగాలు కల్పించే రెండు ప్రముఖ సంస్థలతో ఒకేరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ రెండు సంస్థలకు తాజాగా జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో పచ్చజెండా ఊపారు. ఆరోజున ఎంఓయులు కుదుర్చుకున్న సత్వ డెవలపర్స్ సంస్థ విశాఖ మధురవాడలో రూ.1500 కోట్ల పెట్టుబడులు, 25వేల ఉద్యోగాలు, ఎఎన్ఎస్ఆర్ సంస్థ రూ.1000కోట్ల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి)ని ఏర్పాటుచేయడం ద్వారా 10వేలమంది ఉద్యోవగాశాలు కల్పించనుంది.