News7th Jan 05:14 PMSunil Byrisetty1 min read

విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరగనివ్వం

విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 14 వేల కోట్లు ఇన్ఫ్యూజ్ చేశాయని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కోర్టు కేసు సందర్భంగా విశాఖపట్నంలో పర్యటిం

విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరగనివ్వం
విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 14 వేల కోట్లు ఇన్ఫ్యూజ్ చేశాయని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కోర్టు కేసు సందర్భంగా విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ విశాఖ ఉక్కు మూడో బాయిలర్ ను యాక్టివేట్ చేసి ఫుల్ ప్రొడక్షన్ కి తెచ్చింది తామేనన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్ పేయి, చంద్రబాబు కలిసి విశాఖ ఉక్కును కాపాడారని, నేడు మోదీ, చంద్రబాబు కలిసి కాపాడుతున్నారని వివరించారు. ఎవరికీ అపోహలు అవసరం లేదని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, జరగనీయబోమని స్పష్టం చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలని, పదేపదే బెయిల్ అవుట్లు ఇవ్వడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. ప్లాంట్ ప్రాఫిట్లోకి నడవడానికి అందరూ సహకరించాలని, సంస్థకు సంబంధించిన ఒక్క ఎకరాను కూడా వేరే అవసరాల కోసం వినియోగించడం జరగదని తేల్చి చెప్పారు.
Andhra Pradesh
Visakhapatnam Steel Plant
Vizag Steel Plant
Nara Lokesh
Privatization
Central Government
State Government
ప్రభుత్వ రంగ సంస్థ
నిధుల ఇన్ఫ్యూజన్
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article