News6th Nov 12:55 PMSunil Byrisetty1 min read

10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ సదస్సు

రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా విశాఖలో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే విశాఖ

10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ సదస్సు
రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా విశాఖలో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే విశాఖ సదస్సు వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుంటే కుట్రలతో అడ్డుకోవాలని చూస్తారా అంటూ వైసీపీపై మండిపడ్డారు. రైతు పరామర్శ పేరుతో జగన్‌ విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. జగన్‌ మాట్లాడేటప్పుడు వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటే మంచిదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హితవు పలికారు.
Andhra Pradesh
Investment Summit
Visakhapatnam
Gummidi Sandhya Rani
Andhra Government
North Andhra Development
Industrial Growth
ఆంధ్ర ప్రభుత్వం
పెట్టుబడులు
వ్యాపార సదస్సు
ఆర్థిక అభివృద్ధి
Scroll for the next article