News7th Nov 02:36 PMSunil Byrisetty1 min read
ప్రపంచ భాగస్వామ్యాలకు వేదికగా విశాఖ సదస్సు
విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌లో చర్చించే అంశాలు, డిక్లరేషన్లపై సిఐఐ ప్రతినిధులు, అధికారులతో సీఎం రివ్యూ చే
విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమ్మిట్‌లో చర్చించే అంశాలు, డిక్లరేషన్లపై సిఐఐ ప్రతినిధులు, అధికారులతో సీఎం రివ్యూ చేశారు. విశాఖ సమ్మిట్ రాష్ట్రంలో అనేక రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విశ్వవ్యాప్తం చేయాలన్నారు,. విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంకుర సంస్థలను అనుసంధానిస్తూ... చర్చలను వ్యాపార, సాంకేతిక భాగస్వామ్యాల దిశగా తీసుకువెళ్లాలని సూచించారు. ప్రపంచ మార్కెట్లతో రాష్ట్ర పరిశ్రమలను అనుసంధానించడం, ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార పరిచయాలు కల్పించడం ప్రధాన లక్ష్యం కావాలని పేర్కొన్నారు. సాంకేతిక సహకారాన్ని విస్తరించడం, యువత నైపుణ్యాలకు అంతర్జాతీయ అవకాశాలను పరిచయం చేయడం వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం పెంచేలా సదస్సు ఉండాలన్నారు.