News24th Aug 05:20 PMSunil Byrisetty1 min read

పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్తు

2026లో జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీఓ) సదస్సుకు పర్యాటకుల గమ్యస్థానమైన విశాఖపట్నం అతిథ్యం ఇవ్వనుందని ఏపీ పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటిం

పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్తు
2026లో జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీఓ) సదస్సుకు పర్యాటకుల గమ్యస్థానమైన విశాఖపట్నం అతిథ్యం ఇవ్వనుందని ఏపీ పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ఆగస్టు 22 నుంచి 24 వరకు ఒడిశాలోని పూరీలో స్వోస్తి ప్రీమియం బీచ్ రిసార్ట్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 40వ ఐఏటీఓ వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్,ఒడిశా డిప్యూటీ సీఎం, పర్యాటక మంత్రి ప్రభాతి పరిదా ప్రారంభించిన రిజువేనేట్ ఇన్ బౌండ్@2030 అనే అంశంపై జరిగిన మూడు రోజుల ఈవెంట్ లో అజయ్ జైన్ ప్రసంగించి రాష్ట్ర పర్యాటకానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను, ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను, పర్యాటకరంగానికి పారిశ్రామిక హోదా తదితర అంశాలను వివరించారు. పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్ ఉందని అజయ్ జైన్ వెల్లడించారు. ఏపీలో నిర్మించ తలపెట్టిన కొత్త ఎయిర్ పోర్టుల గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ పర్యాటకాభివృద్ధికి పెద్దఎత్తున కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది విశాఖలో జరిగే ఐఏటీఓ సదస్సుకు ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలికారు.
AP Government
IATO 2026
Visakhapatnam Tourism
AP Tourism
Travel India
Vizag Event
Tourism Development
Ajay Jain
ఐఏటీఓ
భారత పర్యాటకం
Scroll for the next article