News28th Apr 05:15 PMSunil Byrisetty1 min read

విశాఖ మారిపోతోంది.. త్వరలో గూగుల్!

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖకు కొ

విశాఖ మారిపోతోంది.. త్వరలో గూగుల్!
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖకు కొత్త ఎయిర్ పోర్టు, మెట్రోతో పాటు త్వరలో గూగుల్ రాబోతోందని గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉందని, అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ దిగ్గజ కంపెనీ రూ.లక్ష కోట్లతో పెట్టుబడులు పెడుతోందని వివరించారు. రాయలసీమను డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ డ్రోన్లదేనన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మోదీ నాయకత్వంలో మేకిన్ ఇండియా కార్యక్రమం కింద 130 బిలియన్ యుఎస్ డాలర్లతో హార్డ్‌వేర్ రంగం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భవిష్యత్‌లో 500 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఉత్పత్తులు తయారుచేసే స్థాయికి మన దేశం చేరుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Visakhapatnam
Tirupati
Chandrababu Naidu
financial capital and knowledge hub
Google
విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని
500 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఉత్పత్తులు
తిరుపతిని ఆధ్యాత్మిక నగరం
రాయలసీమను డిఫెన్స్
Scroll for the next article