News21st Jun 09:09 AMSunil Byrisetty1 min read

విశాఖ యోగా డేకు భారీ స్పందన

విశాఖ యోగా డేకు భారీ స్పందన లభించింది. వివిధ ప్రాంతాల ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. ఉదయం 4 గంటలనుంచే ప్రజల రాక మొదలు కాగా, విశాఖలో ఉదయం 5.45 గంటలకు 1.50 లక్షల మంది యోగా సాధనకు వచ్చ

విశాఖ యోగా డేకు భారీ స్పందన
విశాఖ యోగా డేకు భారీ స్పందన లభించింది. వివిధ ప్రాంతాల ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. ఉదయం 4 గంటలనుంచే ప్రజల రాక మొదలు కాగా, విశాఖలో ఉదయం 5.45 గంటలకు 1.50 లక్షల మంది యోగా సాధనకు వచ్చినట్లు లెక్కించారు. గతంలో గుజరాత్ సూరత్ లో 1,47,952 మందితో చేసిన యోగా రికార్డును ఇప్పటికే విశాఖ యోగా డే అధిగమించినట్లయింది. ప్రాంగణంలో క్యూర్ కోడ్‌ను స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే అధికారులు లెక్కిస్తుండటంతో అంతకుమించి వచ్చారని అంచనా వేస్తున్నారు. ఉదయం 6.18 గంటలకు 2 లక్షల10వేల 769 మంది బీచ్ వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. 7 గంటల సమయానికి మరో లక్ష మంది కనీసం చేరినట్లు అధికారులు చెబుతున్నారు.
Andhra Pradesh
Visakhapatnam
yoga day
international yoga day
Km modi
Surat yoga record
యోగాలో సూరత్ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన విశాఖ
Scroll for the next article