News18th Apr 09:45 AMSunil Byrisetty1 min read

ఏపీ టు తెలంగాణ టు ఆంధ్రా.. మరో ఎమ్మెల్యే అసంతృప్తి!

ఆంధ్రాలోని ఒక చోటు నుంచి ఆంధ్రాలోని మరో చోటుకు విమానంలో వెళ్లాలంటే వయా తెలంగాణ అవుతోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే దీనిపై సీరియస్‌గా స్పందించిన

ఏపీ టు తెలంగాణ టు ఆంధ్రా.. మరో ఎమ్మెల్యే అసంతృప్తి!
ఆంధ్రాలోని ఒక చోటు నుంచి ఆంధ్రాలోని మరో చోటుకు విమానంలో వెళ్లాలంటే వయా తెలంగాణ అవుతోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే దీనిపై సీరియస్‌గా స్పందించిన టీడీపీ అధిష్టానం మందలించింది. ప్రభుత్వం మనదే, విమానయాన మంత్రి మనవారే.. వారి దృష్టికి తీసుకురావొచ్చు కదా? అంటూ ప్రశ్నించింది. ఇలాంటివి రిపీట్‌ కావొద్దంటూ హెచ్చరించింది. తాజాగా కూటమిలోని మరో ఎమ్మెల్యే ఇదే అంశంపై గళమెత్తారు. బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు సైతం విశాఖ నుంచి ఉదయంపూట విజయవాడకు విమాన కనెక్టివిటీ లేదన్నారు. విజయవాడలో పార్టీ మీటింగ్ లు, ప్రభుత్వ అవసరాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Visakhapatnam
Amaravati Flights
Vishnu Kumar Raju
Aviation Issues
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
Scroll for the next article