News5th Nov 09:48 AMSunil Byrisetty1 min read

విజన్ ఉంటే ఏ రంగంలోనైనా అభివృద్ధి

రేపటి తరం భవిష్యత్ కోసం సరైన వేదికలను సిద్దం చేయాల్సిన బాధ్యత పాలకులు, నేటి పారిశ్రామిక వేత్తల మీద ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్

విజన్ ఉంటే ఏ రంగంలోనైనా అభివృద్ధి
రేపటి తరం భవిష్యత్ కోసం సరైన వేదికలను సిద్దం చేయాల్సిన బాధ్యత పాలకులు, నేటి పారిశ్రామిక వేత్తల మీద ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రెండు అవార్డులు అందించింది. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును నారా భువనేశ్వరి అందుకున్నారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఆమె అందుకున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో ప్రకటించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఇదే వేదిక మీద అందుకున్నారు. మంగళవారం లండన్ లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.
Ap development
Chandrababu Naidu
Nara Bhuvaneshwari
Heritage Foods
Institute of Directors
Golden Peacock Award
కార్పొరేట్ గవర్నెన్స్
సామాజిక ప్రభావం
లండన్ అవార్డులు
Scroll for the next article