Politics29th Sep 03:47 PMSunil Byrisetty1 min read
వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు జగనే!?
వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు జగనే అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే' అన్న చందంగా తప్పులు తాము చేస్తూ ఇతరులప
వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు జగనే అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే' అన్న చందంగా తప్పులు తాము చేస్తూ ఇతరులపై ఎదురుదాడికి దిగడం వైసీపీ నాయకులకు నిత్యకృత్యంగా మారిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సంస్కృతిని పెంచి పోషించిందే గత వైసీపీ ప్రభుత్వమని మండిపడ్డారు. గురువుల మీదకు రౌడీషీటర్లను, సంఘ విద్రోహ శక్తులను పంపి దాడులు చేయించడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి పైశాచిక చర్యలను సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. అనారోగ్యంతో ఉన్న కాకుమాను రాజశేఖర్‌ను బలవంతంగా ధర్నాకు పిలిపించి, సరైన సమయంలో చికిత్స అందించకుండా ప్రాణాలు కోల్పోయేలా చేసి, ఇప్పుడు ఆయన మరణంపై కూడా శవ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తును ఈడీ, సీబీఐ ముమ్మరం చేయడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.