Mobiles1st Aug 06:04 PMSunil Byrisetty1 min read
ఆరేళ్ల తర్వాత.. స్టైలిష్ డిజైన్ తో vivo S2
వివో సంస్థ ఆరేళ్ల తర్వాత వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఆగస్టు 6న లాంచ్ చేస్తున్నట్లు వివో ప్రకటించింది. వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ స్టైలిష్ అండ్ స్లీక్ డిజైన్ తో లాంచ్
వివో సంస్థ ఆరేళ్ల తర్వాత వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఆగస్టు 6న లాంచ్ చేస్తున్నట్లు వివో ప్రకటించింది. వివో ఎస్2 స్మార్ట్ ఫోన్ స్టైలిష్ అండ్ స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. అలాగే, వెనుక కూడా కర్వుడ్ బ్యాక్ ప్యానల్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.59 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360 ప్రాసెసర్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి. అయితే , కొన్ని లీక్స్ ద్వారా ఈ వివో అప్ కమింగ్ ఫోన్ Snapdragon 8 Gen 5 తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.