Mobiles26th May 01:24 PMSunil Byrisetty1 min read
50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo T4 Ultra ఫోన్!
వివో అత్యాధునిక పెరిస్కోప్ కెమెరాతో టి సిరీస్ ను తీసుకొస్తోంది. వివో టి సిరీస్ నుంచి Vivo T4 Ultraతో పరిధిని విస్తరించడానికి చూస్తోంది. సర్టిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ ఫోన్ సిర
వివో అత్యాధునిక పెరిస్కోప్ కెమెరాతో టి సిరీస్ ను తీసుకొస్తోంది. వివో టి సిరీస్ నుంచి Vivo T4 Ultraతో పరిధిని విస్తరించడానికి చూస్తోంది. సర్టిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ ఫోన్ సిరీస్ లో వచ్చిన ఫోన్స్ తో పోలిస్తే మెరుగైన ఫీచర్స్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. 50MP Sony IMX921 మెయిన్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ కెమెరా మరియు 8Mp అల్ట్రా వైడ్ కెమెరాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. డిస్ప్లే 6. 67 ఇంచ్ pOLED, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన కర్వుడ్ స్క్రీన్ ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ కళ్ళకు హాని కలిగించని ఐ కేర్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9300 Plus చిప్ సెట్ కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. 8GB ర్యామ్, ఇంకా ఎక్కువ స్టోరేజీ కూడా ఉండవచ్చు. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.