Mobiles31st Jan 04:40 PMSunil Byrisetty1 min read
50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్తో Vivo X200T
వివో భారత మార్కెట్లోకి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ 'వివో ఎక్స్200టీ'ని ఇటీవలే విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఎక్స్200 మోడల్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా దీనిని తీసుకువచ్చారు. పాత మోడల
వివో భారత మార్కెట్లోకి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ 'వివో ఎక్స్200టీ'ని ఇటీవలే విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఎక్స్200 మోడల్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా దీనిని తీసుకువచ్చారు. పాత మోడల్‌తో పోలిస్తే మెరుగైన సాఫ్ట్‌వేర్ ఎక్స్పీరియెన్స్ని తక్కువ ధరకే అందించడమే లక్ష్యంగా వివో ఈ ఫోన్‌ను రూపొందించింది. వివో ఫోన్లో 6.67 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఇది అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6పై ఈ స్మార్ట్ఫోన్ రన్ అవుతుంది. ఐదు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 7 ఏళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచీలను అందిస్తామని వివో స్పష్టం చేసింది. సాధారణ ఎక్స్200తో పోలిస్తే ఇందులో పెద్దదైన 6,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 90డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 40డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.