Mobiles20th Jun 12:10 PMSunil Byrisetty1 min read
కొత్త వివో వై400 ప్రో.. ఫీచర్లు ఇవే..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల సంస్థ వివో వై సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో 5జీ కనెక్టివిటీతో వస్తున్న వివో వై400 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుద
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల సంస్థ వివో వై సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో 5జీ కనెక్టివిటీతో వస్తున్న వివో వై400 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుండటం విశేషం. దీనిలో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా, వేగవంతమైన 90 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ సుమారు రూ.25,000లకు అందుబాటులోకి రావచ్చని అంచనా.
వివో వై400 ప్రో స్పెసిఫికేషన్లు..
6.77 ఇంచ్ AMOLED, 120Hz రిఫ్రెష్ రేటు, 4500 nits పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్
8GB ర్యామ్. 256GB స్టోరేజీ వరకు
50MP డ్యూయల్ రియర్ కెమెరా (Sony IMX882), 32MP ఫ్రంట్ కెమెరా
5500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్
ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్