News8th Apr 09:36 AMSunil Byrisetty1 min read

’పరీక్షకు విద్యార్థుల ఆలస్యం'పై పవన్ సీరియస్

విశాఖ జిల్లా పెందుర్తిలో తన కాన్వాయ్ వల్ల విద్యార్థులు జేఈఈ పరీక్షకు ఆలస్యమయ్యారన్న వార్తలపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పెందుర్తి అయాన్ డిజిటల్స్‌లో జేఈఈ పరీక్షకు ఏర్ప

’పరీక్షకు విద్యార్థుల ఆలస్యం'పై పవన్ సీరియస్
విశాఖ జిల్లా పెందుర్తిలో తన కాన్వాయ్ వల్ల విద్యార్థులు జేఈఈ పరీక్షకు ఆలస్యమయ్యారన్న వార్తలపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పెందుర్తి అయాన్ డిజిటల్స్‌లో జేఈఈ పరీక్షకు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు వెళ్లే సమయంలో పవన్ కాన్వాయ్ అటుగా వచ్చింది. దీంతో విద్యార్థులను, వారి వాహనాలను పోలీసులు నిలిపేశారు. దీంతో పరీక్షకు 2 నిమిషాలకు ఆలస్యంగా చేరడంతో అనుమతించలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ స్పందించారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఎంత సేపు నిలిపారో, విద్యార్థులు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎలా ఉందోనన్న విషయాలపై విచారణ చేయాలని వైజాగ్ పోలీసుల్ని ఆదేశించారు. అయితే పవన్ కాన్వాయ్ వెళ్లిన సమయంలోనూ ట్రాఫిక్‌ను ఎక్కడా ఆపలేదని వైజాగ్ పోలీసులు చెబుతున్నారు.
Pawan Kalyan
Vizag
JEE advance Exam
Pendurthi Students
జేఈఈ పరీక్ష
పవన్ కాన్వాయ్
Scroll for the next article