News14th Jul 09:45 AMSunil Byrisetty1 min read
విశాఖలో రెండో 'బిమ్స్ టెక్' పోర్టుల సదస్సు
విశాఖ కేంద్రంగా నేడు, రేపు అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. విశాఖ పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. 'బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్టనర్షిప్స్' పేరుతో ర
విశాఖ కేంద్రంగా నేడు, రేపు అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. విశాఖ పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారు. 'బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్టనర్షిప్స్' పేరుతో రెండో ఎడిషన్ జరుగుతోంది. సదస్సులో భారత్ సహా ఏడు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకు కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్ హాజరు కానున్నారు. సదస్సులో పోర్టు అథారిటీల అధికారులు, నౌకాశ్రయ నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొని చర్చిస్తారు.
సభ్యదేశాల్లో ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారంపై చర్చ జరుగుతుంది.
బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఓడ రవాణా, పర్యాటకం వంటి రంగాల్లో సహకారం, ప్రాంతీయ నౌకాశ్రయాలు, పెట్టుబడులు రంగాల్లో సహకారం బలోపేతంలో కీలకపాత్ర పోషించడం తదితర అంశాలపై మాట్లాడనున్నారు.