News22nd Aug 11:52 AMSunil Byrisetty1 min read

ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్‌?

ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ అడుగులు వేస్తోందనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రత విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవ

ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్‌?
ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ అడుగులు వేస్తోందనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రత విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు మూడు నెలల గడువు విధించినట్లు తెలుస్తోంది. నవంబర్ 17లోగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మొత్తం ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.2024 వరకు స్టీల్ ప్లాంట్‌లో సుమారు 1,500 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహించారు. అనంతరం దశలవారీగా బలగాల ఉపసంహరణ కొనసాగింది. ప్రస్తుతం సుమారు 350 మంది భద్రతా సిబ్బంది, 120 మంది అగ్నిమాపక భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిని కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశాలు రావడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతపైనా గందరగోళం నెలకొంది.
Andhra Pradesh
Visakhapatnam Steel Plant
Vizag Steel Plant
Privatisation
CISF
Ministry of Home Affairs
Security Personnel
CISF ఉపసంహరణ
స్టీల్ ప్లాంట్ భద్రత
విశాఖ వార్తలు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article