News30th Jun 10:41 AMSunil Byrisetty1 min read
విశాఖ స్టీల్‌కు పూర్వ వైభవం
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు పేరుతో చేసిన పోరాటాల ఫలితంగా ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవం దిశగా సాగుతోంది. ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నెస్-3 ప్రారంభం కావడంతో పూ
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు పేరుతో చేసిన పోరాటాల ఫలితంగా ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవం దిశగా సాగుతోంది. ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నెస్-3 ప్రారంభం కావడంతో పూర్వ వైభవం సాధించేందుకు రూట్ క్లియర్ అయ్యింది. రెండేళ్లుగా అధికారులు, ఉద్యోగులు నిరాశతో గడుపుతుండగా నిన్న ఫర్నెస్-3 ప్రారంభం కావడంతో నికర లాభాలు సాధించొచ్చని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్ర ప్రభుత్వం రూ.11,440కోట్ల ఆర్థిక ప్యాకేజీ అందించడం, మూడో ఫర్నెస్ ప్రారంభించడంతో నిత్యం 21 వేల టన్నుల ఉత్పత్తి సాధ్యం కానుంది.