News23rd Apr 04:35 PMSunil Byrisetty1 min read

సూసైడ్ నుంచి కాపాడిన పోలీస్.. ఎస్పీ ప్రశంసలు!

విజయనగరం వైఎస్ఆర్ నగర్‌లో యువతి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్ 112కు వచ్చిన ఫిర్యాదుపై, తక్షణమే స్పందించిన కానిస్టేబుల్ ఆర్.జగదీష్ ప్రాణాలు కాపాడారు. విజయనగరం 2వ పట్టణ పోలీసు

సూసైడ్ నుంచి కాపాడిన పోలీస్.. ఎస్పీ ప్రశంసలు!
విజయనగరం వైఎస్ఆర్ నగర్‌లో యువతి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్ 112కు వచ్చిన ఫిర్యాదుపై, తక్షణమే స్పందించిన కానిస్టేబుల్ ఆర్.జగదీష్ ప్రాణాలు కాపాడారు. విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో కానిస్టేబులుగా పని చేస్తున్న ఆర్.జగదీష్ కాల్ వచ్చిన వెంటనే సకాలంలో స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సదరు యువతి గదిలోకి వెళ్లి, తలుపు వేసుకొని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. తక్షణమే కానిస్టేబుల్ జగదీష్ తలుపులు పగులుగొట్టి, ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న యువతిని క్రిందకు దించారు. తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యకు యత్నించినట్లుగా గుర్తించి, సదరు యువతికి కౌన్సిలింగ్ నిర్వహించారు. సకాలంలో స్పందించి, ఆత్మహత్యయత్నం నుంచి రక్షించిన కానిస్టేబుల్ జగదీష్‌ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రంతో సత్కరించారు.
Vizianagaram
YSR Nagar
Constable R. Jagadish
Woman attempts suicide
తక్షణమే స్పందించిన కానిస్టేబుల్ ఆర్.జగదీష్
విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్
Scroll for the next article