Education2nd Mar 07:37 PMSunil Byrisetty1 min read
నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలి
విద్యార్థుల్లో చదువుతో పాటు వృత్తి విద్యా నైపుణ్యాల పట్ల ఆసక్తిగా కనబరిచేలా ప్రోత్సహించాలని ఒకేషనల్ ట్రైనర్లను ఉద్దేశిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్
విద్యార్థుల్లో చదువుతో పాటు వృత్తి విద్యా నైపుణ్యాల పట్ల ఆసక్తిగా కనబరిచేలా ప్రోత్సహించాలని ఒకేషనల్ ట్రైనర్లను ఉద్దేశిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విజయవాడలోని మేరి స్టెల్లా కాలేజీలో జరుగుతున్న వృత్తి విద్యా శిక్షకులకు ఐదు రోజుల పాటు శిక్షణా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు 10 ట్రేడుల్లో వృత్తి విద్యా కోర్సు అందిస్తున్నామని తెలిపారు.
ఏ విద్యార్థీ పనికిరాడని చదువుకు దూరం చేయకూడదని, విద్యార్థుల్లో కొంతమందికి ఆటలు ఇష్టం, కొంతమందికి సైన్స్ ఇష్టం.. ఇలా ఏ అంశంలో ఆసక్తి ఉంటే అందులో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. వృత్తి విద్యా కోర్సు ద్వారా విద్యార్థుల డ్రాపౌట్ రేటు తగ్గించవచ్చన్నారు.