News10th Apr 12:00 PMSunil Byrisetty1 min read
ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు
కడప జిల్లా ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఐదవ రోజు మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు. స్వామి అమ్మవార్లకు పుష్ప మాలికలు, స్వర్ణా
కడప జిల్లా ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
ఐదవ రోజు మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.
స్వామి అమ్మవార్లకు పుష్ప మాలికలు, స్వర్ణాభరణాలతో పండితులు అలంకరించారు.
మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోలాహలంగా జగదభి రామయ్య వాహన సేవ కన్నుల పండువగా జరిగింది.
భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు.
11న సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్ట విచ్చేసి స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు